Chandrababu Naidu: సామాజిక మాధ్యమాలలో వ్యక్తిత్వ హననం దురదృష్టకరం: చంద్రబాబు

Chandrababu Naidu says Character assassination on social media is unfortunate
  • అంబేద్కర్ అత్యున్నత రాజ్యాంగం రూపొందించారని వెల్లడి
  • మంగళగిరి ఏపీ హైకోర్టు న్యాయవాదుల కార్యక్రమంలో సీఎం ప్రసంగం
  • ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయన్న ముఖ్యమంత్రి
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదని, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఒక సాధారణ వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి కాగలిగారంటే, అది మన రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు వల్లే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..

‘ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దానిని సరిదిద్దుతోంది. మీడియా రంగంలో ఇటీవల చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సోషల్‌ మీడియాలో అందరూ రచయితలే, అందరూ సంపాదకులే. అయితే, సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరం. ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయి. 2014లో ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకున్నాం. వచ్చే ఏడాది మూడో స్థానానికి, 2047 నాటికి భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Indian Constitution
BR Ambedkar
AP High Court
Social Media
Economic Reforms
Indian Economy

More Telugu News