Sabarimala Temple: సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Sabarimala Ayyappa Temple Doors Open Today Evening
  • మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ షురూ
  • రేపటి నుంచి భక్తులకు స్వామి వారి దర్శనం
  • ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న భక్తులకే అనుమతి
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు ఈ రోజు సాయంత్రం తెరుచుకోనున్నాయి. మండల మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ఈ రోజుతో ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు శబరిమల ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో తలుపులు తెరిచి ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి ప్రారంభ పూజ నిర్వహిస్తారు. గర్భగుడి నుంచి జ్వాలను తీసుకొచ్చి 18 మెట్లు వద్ద అధి (పవిత్ర మంట)ను వెలిగిస్తారు.

రేపటి నుంచి భక్తులకు అనుమతి..
ఆలయ తలుపులు ఆదివారమే తెరుచుకున్నా.. సోమవారం నుంచే భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. సోమవారం తెల్లవారుజామున అధికారిక ఆచారాలు, కొత్త పూజారులు తలుపులు తెరవడంతో మండల మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌ ప్రారంభమవుతుంది. ఆన్ లైన్ లో టికెట్లను బుక్‌ చేసుకున్న భక్తులను ప్రతిరోజు 70 వేల మందిని దర్శనానికి అనుమతిస్తారు. పంబ, నీలక్కల్‌, ఎరుమేలి, వండి పెరియార్‌ సత్రం, చెంగన్నూరులలో స్పాట్‌ బుకింగ్‌ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కాగా, ఈ సీజన్ లో అయ్యప్పను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ట్రావెన్ కోర్ దేవోసం బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.
Sabarimala Temple
Ayyappa Swamy
Mandala Makaravilakku
Kerala Temples
Arun Kumar Namboodri
Kandararu Mahesh
Pilgrimage Season
Spot Booking
Travancore Devaswom Board
Sabarimala Darshan

More Telugu News