Ramoji Rao: రామోజీరావు ఒక మహనీయుడు: చంద్రబాబు

Ramoji Rao A Great Man Says Chandrababu
  • రామోజీరావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు
  • నిష్పక్షపాత జర్నలిజానికి కొత్త ప్రమాణాలు నెలకొల్పారని ప్రశంస
  • ‘ఈనాడు’తో సమాజంపై అపూర్వ ప్రభావం చూపారని కొనియాడిన సీఎం
రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకులు, స్వర్గీయ రామోజీరావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామోజీరావు సేవలను స్మరించుకుంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.

నిష్పక్షపాత జర్నలిజానికి రామోజీరావు నూతన ప్రమాణాలను నెలకొల్పారని చంద్రబాబు కొనియాడారు. ‘ఈనాడు’ సంస్థల ద్వారా సమాజంపై చెరగని ముద్ర వేసిన మహనీయుడని ఆయన పేర్కొన్నారు. కేవలం జర్నలిజంలోనే కాకుండా, వ్యాపార రంగంలోనూ ప్రజాహితం, విలువలు, నైతికతను పాటించిన అరుదైన దార్శనికుడు రామోజీరావు అని చంద్రబాబు అభివర్ణించారు. రామోజీరావు చూపిన మార్గాన్ని శాశ్వత స్ఫూర్తిగా మలచుకుందామని పిలుపునిచ్చారు.
Ramoji Rao
Chandrababu Naidu
Eenadu
Ramoji Group
Journalism
Andhra Pradesh
Business
Telugu News
Tribute
Death Anniversary

More Telugu News