Sankranti Holidays: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు!

Sankranti Holidays Announced for Telugu States
  • ఏపీలో విద్యార్థులకు 9 రోజుల సంక్రాంతి సెలవులు
  • జనవరి 10 నుంచి 18 వరకు పాఠశాలలకు విరామం
  • తెలంగాణలోనూ 6 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం
  • జనవరిలో మరిన్ని ప్రభుత్వ సెలవులు రాక
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పాఠశాలలకు సుదీర్ఘ సెలవులు ప్రకటించాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సెలవులకు సంబంధించిన షెడ్యూల్ వెలువడింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, 2026 జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. జనవరి 19న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

ఇక తెలంగాణలో జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ సుదీర్ఘ సెలవుల నేపథ్యంలో చాలా కుటుంబాలు తమ సొంతూళ్లకు వెళ్లి బంధువులతో కలిసి పండుగ జరుపుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు అప్పుడే ఊపందుకున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత కూడా జనవరి నెలలో మరిన్ని సెలవులు రానున్నాయి. జనవరి 23న వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు సెలవులు ఉంటాయి. 
Sankranti Holidays
AP Schools
TS Schools
Andhra Pradesh Holidays
Telangana Holidays
School Holidays 2026
Sankranti Festival
AP Academic Calendar
TS Academic Calendar
January Holidays

More Telugu News