MK Stalin: అది మాకు గుణపాఠం: స్టాలిన్

Stalin Bihar Election Results a Lesson for INDIA Coalition
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం
  • ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎదురుదెబ్బ
  • ఫలితాల నుంచి ఎంతో నేర్చుకోవాలన్న స్టాలిన్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు 'ఇండియా' కూటమికి ఒక పాఠం లాంటివని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు అభినందనలు తెలియజేస్తూనే, కూటమి ఓటమిపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 202 స్థానాల్లో జయభేరి మోగించింది. మరోవైపు, అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగిన మహాఘఠ్‌బంధన్ కేవలం 34 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు.

"బీహార్‌లో విజయం సాధించిన నితీశ్ కుమార్‌కు అభినందనలు. గట్టిగా పోరాడిన తేజస్వి యాదవ్‌ను కూడా అభినందిస్తున్నాను. ఎన్నికల ఫలితాలు అనేవి సంక్షేమ పథకాలు, సరైన పొత్తులు, రాజకీయ సందేశంపై ఆధారపడి ఉంటాయి. ఈ ఫలితాలు ఇండియా కూటమికి ఒక పాఠం. దీని నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి" అని స్టాలిన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులైన నేతలు ఉన్నారని, సవాళ్లను అధిగమించే వ్యూహాలను వారు రచిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరుపై స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఈసీపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేమని, దాని ప్రతిష్ట దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.        
MK Stalin
Stalin
Bihar Election Results
Nitish Kumar
INDIA alliance
Tejashwi Yadav
Tamil Nadu CM
Election Commission of India
political strategy
NDA victory

More Telugu News