RJD: జేడీయూ, బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు ఆర్జేడీకే.. అయినా తప్పని ఓటమి

RJD Lost Despite More Votes Than JDU BJP in Bihar Elections
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల షేర్ లో ఆర్జేడీదే ఆధిక్యం
  • మొత్తం ఓట్లలో 23 శాతం ఓట్లు తేజస్వీ యాదవ్ పార్టీకే..
  • బీజేపీకి 20 శాతం ఓట్లు, జేడీయూకు 19.25 శాతం ఓట్లు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో జట్టు కట్టి మహాఘట్ బంధన్ తో ఆర్జేడీ ఈ ఎన్నికలను ఎదుర్కొంది. అయితే, ఫలితాల్లో మాత్రం ఊహకందని రీతిలో కేవలం 35 సీట్లను మాత్రమే గెల్చుకుంది. ఆర్జేడీ సొంతంగా కేవలం 25 సీట్లను మాత్రమే గెల్చుకుంది. పార్టీ చరిత్రలోనే ఇంత తక్కువ సీట్లు గెల్చుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

అయితే, ఈ ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీకి ఓట్లేసిన వారి సంఖ్య మిగతా పార్టీలకంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలలోనూ కలిపి మొత్తం పోలైన ఓట్లలో 23 శాతం ఓట్లు ఆర్జేడీ పార్టీకే పడ్డాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఘన విజయం సాధించిన బీజేపీ, జేడీయూ పార్టీలు ఓట్ షేర్ లో మాత్రం వెనుకంజలోనే ఉన్నాయి. బీజేపీకి 20 శాతం ఓట్లు పోలవగా.. సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు 19.25 శాతం ఓట్లు పోలయ్యాయి.
RJD
Bihar Elections
Rashtriya Janata Dal
Tejashwi Yadav
BJP
JDU
Mahagathbandhan
Bihar Assembly Elections
Vote Share
Nitish Kumar

More Telugu News