Vijayawada Singapore Flights: నేటి నుంచి విజయవాడ-సింగపూర్ విమాన సర్వీసులు

Vijayawada Singapore Flights Start Today
  • ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో నడవనున్న అంతర్జాతీయ విమానం
  • వారంలో మూడు రోజులు అందుబాటులో ఉంటుందన్న గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంతరెడ్డి
  • ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు నడుస్తుందని వెల్లడి
  • ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ-సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసు శనివారం నుంచి ప్రారంభం కానుంది. విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వీసును నడిపేందుకు ముందుకు వచ్చింది. ఈ అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి రావడంతో అమరావతి రాజధాని ప్రాంతం నుంచి విదేశీ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి.
 
గన్నవరం విమానాశ్రయంలో ఈ తొలి సర్వీసును విమానాశ్రయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ విమాన సర్వీసు వారానికి మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుందని గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంతరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో విజయవాడ నుంచి సింగపూర్‌కు, అలాగే సింగపూర్ నుంచి విజయవాడకు విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఈ కొత్త సర్వీసుతో వ్యాపార, పర్యాటక, విద్యా సంబంధిత ప్రయాణాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Vijayawada Singapore Flights
Gannavaram Airport
Amaravati
International Flights
Andhra Pradesh
Indigo Airlines
Vallabhaneni Balashouri
Yarlagadda Venkatrao

More Telugu News