Lankala Deepak Reddy: జూబ్లీహిల్స్ లో బీజేపీకి కోలుకోలేని షాక్... డిపాజిట్ గల్లంతు

BJPs Lankala Deepak Reddy Fails to Save Deposit in Jubilee Hills
  • జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం
  • కేవలం 17,061 ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి
  • డిపాజిట్ కూడా రాకపోవడంతో డీలా పడ్డ బీజేపీ శ్రేణులు
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటిన బీజేపీ... తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. కేవలం 17,061 ఓట్లు మాత్రమే సాధించిన దీపక్ రెడ్డి... డిపాజిట్ కోల్పోయారు. 

ఈ ఘోర ఓటమితో తెలంగాణలోని బీజేపీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. ఓవైపు బీహార్ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతుండగా... తెలంగాణలో వచ్చిన ఫలితాలు ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. డిపాజిట్ కూడా గల్లంతు కావడాన్ని బీజేపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
Lankala Deepak Reddy
Jubilee Hills byelection
Telangana BJP
Congress Party
BRS Party
Naveen Yadav
Telangana Elections
BJP loss
Deposit lost
Telangana Politics

More Telugu News