Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ తీర్పుతో బీఆర్ఎస్ పార్టీకి సెలవు ప్రకటించారు: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud says Jubilee Hills verdict is farewell to BRS
  • జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారన్న టీపీసీసీ చీఫ్
  • పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమన్న మహేశ్ కుమార్ గౌడ్
  • రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చోటు లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
జూబ్లీహిల్స్ తీర్పుతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి సెలవు ప్రకటించారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చోటులేదని మరోసారి రుజువైందని అన్నారు. రానున్న రోజుల్లోనూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు. నవీన్‌ యాదవ్‌ను గెలిపించిన ఘనత ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది అని అన్నారు.
Mahesh Kumar Goud
Jubilee Hills
BRS Party
Telangana Congress
TPCC
Naveen Yadav

More Telugu News