Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక... పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యత

 Jubilee Hills By Election Congress Ahead of BRS BJP in Early Counting
  • జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం
  • పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ కు 3 ఓట్ల లీడ్
  • తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 62 ఓట్ల ఆధిక్యత
తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ మొదలుపెట్టారు. లెక్కింపు కోసం మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

నిబంధనల ప్రకారం, అధికారులు మొదటగా పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యం లభించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 39 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి 10 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ 3 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. 

అనంతరం తొలి రౌండ్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. తొలి రౌండ్ లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించింది. ఫస్ట్ రౌండ్ లో కాంగ్రెస్ కు 62 ఓట్ల ఆధిక్యత వచ్చింది. కాంగ్రెస్ కు 9,826 ఓట్లు, బీఆర్ఎస్ కు 8,864 ఓట్లు వచ్చాయి.
Naveen Yadav
Jubilee Hills by election
Telangana election results
Congress party
Maganti Sunitha
BRS party
Lankala Deepak Reddy
BJP party
Postal ballot counting
Kotla Vijayabhasker Reddy Indoor Stadium

More Telugu News