Ponnam Prabhakar: నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపోలను లాభాల్లోకి తెచ్చే కార్యాచరణ రూపొందిస్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar Plans to Revive Loss Making RTC Depots
  • ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం
  • ఆర్టీసీ రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలని అధికారులకు ఆదేశం
  • కొత్త కాలనీలకు రూట్‌లు పెంచేలా అధ్యయనం చేయాలని సూచన
నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఆర్టీసీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్త కాలనీలకు రూట్‌లు పెంచే విషయమై అధ్యయనం చేయాలని సూచించారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన కండక్టర్ల ప్రొవిజన్ పీరియడ్ రెండేళ్లకు తగ్గించాలని అన్నారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపోలు లాభాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆరాంఘర్ బస్సు టెర్మినల్ కోసం పోలీసు శాఖ భూములపై చర్చించాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కొత్త డిపోలకు స్థల పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బస్సు ప్రమాదాలను తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు చేస్తామని అన్నారు. త్వరలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
Ponnam Prabhakar
RTC
Telangana RTC
Bus Transport
RTC Revenue
Bus Routes

More Telugu News