ఎప్ స్టీన్ ఈమెయిల్ లో ట్రంప్ పేరు.. సంచలన ఈమెయిల్ బయటపెట్టిన డెమోక్రాట్లు
- ఓ బాధితురాలితో ట్రంప్ గంటల పాటు ఉన్నారని మెయిల్ లో పేర్కొన్న ఎప్ స్టీన్
- ఈ మెయిల్ ను ఆయన తన సహచరురాలికి పంపినట్లు వెల్లడించిన డెమోక్రాట్లు
- 2011 ఏప్రిల్ 2న ఎప్ స్టీన్ పంపిన మెయిల్ లో ట్రంప్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్య
ఎవరీ ఎప్ స్టీన్..?
అమెరికాకు చెందిన అత్యంత సంపన్నుల్లో జెఫ్రీ ఎప్ స్టీన్ ఒకడు. ఆయన ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసి విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడు. అమెరికాలోని ధనవంతులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఎప్ స్టీన్ తరచుగా అక్కడ ఖరీదైన పార్టీలు ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే పలువురు మైనర్లతో పాటు మహిళలను అక్రమ లైంగిక సంబంధాలకు వాడుకున్నాడనే నేరారోపణతో ఎప్ స్టీన్ జైలుపాలయ్యాడు. విచారణ జరుగుతుండగానే జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలువురు ప్రముఖులకు మైనర్లతో విందులు ఏర్పాటు చేశారని ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఎప్ స్టీన్ ఫైల్స్ పేరుతో వెలుగుచూడడం అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి నేరస్థుడితో ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవని డెమోక్రాట్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. తాజాగా బయటపెట్టిన ఎప్ స్టీన్ ఈ మెయిల్ లో ట్రంప్ పేరు బయటపడడం మరోమారు సంచలనం సృష్టించింది.