Prakash Raj: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ వ్యవహారం... సిట్ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్
- బుధవారం సాయంత్రం సిట్ ఎదుట హాజరైన ప్రకాశ్ రాజ్
- సీఐడీ కార్యాలయంలో నటుడిని ప్రశ్నిస్తున్న అధికారులు
- నిన్న విజయ్ దేవరకొండను ప్రశ్నించిన అధికారులు
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో విచారణకు హాజరయ్యారు. సీఐడీ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో నటుడు విజయ్ దేవరకొండను నిన్న విచారించారు. ఈ కేసులో ప్రకాశ్ రాజ్ జులై 30న ఈడీ విచారణకు హాజరయ్యారు.
బెట్టింగ్ యాప్‌లకు కొందరు సినీ తారలు, సెలబ్రిటీలు ప్రచారం చేశారు. ఈ యాప్‌లకు బానిసలైన కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో విచారణకు సీఐడీ అదనపు డీజీపీ నేతృత్వంలో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆయా కేసుల్లో ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నారు.