Kalyani Priyadarshan: నెక్స్ట్ లెవెల్లో 'లోకా' సీక్వెల్!

 Loka Movie sequel Update
  • ఆగస్టులో థియేటర్స్ కి వచ్చిన 'లోకా' 
  • 300 కోట్లకి పైగా రాబట్టిన సినిమా 
  • సీక్వెల్ లో కనిపించనున్న మమ్ముట్టి 
  • తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న దుల్కర్       

'లోకా చాప్టర్ 1: చంద్ర' ..  ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన సినిమా పేరు ఇది. కల్యాణి ప్రియదర్శన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. 30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 300 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే మొదటిసారి అనే టాక్ బలంగా వినిపించింది.

ఈ సినిమాకి సీక్వెల్ ఉంది. అందుకు సంబంధించిన హింట్ ఇస్తూనే 'చాప్టర్1'ను  ముగించారు. సీక్వెల్ ఎలా ఉండనుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. కథాకథనాల విషయం అలా ఉంచితే, నిర్మాణం పరంగా భారీ బడ్జెట్ ను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. అందువల్లనే దుల్కర్ తో పాటు మమ్ముట్టి కూడా ఈ సీక్వెల్ లో కనిపించనున్నాడని అనుకోవచ్చు. మమ్ముట్టి ఈ సినిమాలో చేస్తారని దుల్కర్ స్వయంగా చెప్పడం విశేషం. 

దుల్కర్ కథానాయకుడిగా నటించిన 'కాంత', ఈ నెల 14వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ 'లోకా' సీక్వెల్ గురించి ప్రస్తావించాడు. 'ఈ సినిమా ఫస్టు పార్టులోనే నాన్న కనిపిస్తే బాగుంటుందని భావించాను .. కానీ కుదరలేదు. సీక్వెల్ లో ఆయన తప్పకుండా కనిపిస్తారు. ఆయనతో నేను స్క్రీన్ షేర్ చేసుకునే మొదటి సినిమా ఇదే అవుతుంది" అని దుల్కర్ చెప్పారు.

Kalyani Priyadarshan
Loka Chapter 1 Chandra
Loka sequel
Dulquer Salmaan
Mammootty
Dominic Arun
Katha Movie
Telugu cinema
Indian movies
Malayalam film

More Telugu News