Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై వందల కోట్ల రూపాయల బెట్టింగ్...!

Jubilee Hills Bypoll Sees Hundreds of Crores in Betting
  • జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ
  • ఫలితాలపై భారీ స్థాయిలో బెట్టింగులు
  • బీహార్ ఎన్నికల ఫలితాలపై కూడా బెట్టింగులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుండటం, అత్యధికంగా సెటిలర్ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడంతో ఈ ఉప ఎన్నికకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనిపించింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం. దాదాపు 500 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌లు జరిగాయని తెలుస్తోంది. గెలుపుతో పాటు మెజార్టీపై కూడా బెట్టింగ్‌లు వేసినట్లు చెబుతున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ కాశారని సమాచారం.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలుపుతున్నాయి.
Jubilee Hills Bypoll
Telangana Elections
Telangana Politics
Congress Party
BRS Party
BJP Party

More Telugu News