Gopichand: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన నటుడు గోపీచంద్
- సిరా గుర్తును మీడియాకు చూపించిన గోపీచంద్
- యూసఫ్‌గూడలో ఓటు వేసిన తనికెళ్ల భరణి
- జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రోన్లతో పర్యవేక్షణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖ సినీ నటుడు గోపీచంద్ శ్రీనగర్ కాలనీలోని మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన సిరా గుర్తు ఉన్న వేలిని మీడియాకు చూపించారు. యూసఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తనికెళ్ల భరణి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 31.94 శాతం పోలింగ్ నమోదైంది.
నియోజకవర్గంలో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సాంకేతికతను వినియోగిస్తూ నియోజకవర్గంలో తొలిసారిగా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా తెలిసేలా 136 డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టారు.