Srihari: శ్రీహరి సొంత ఇల్లు వెనుక కథ ఇది!

Chandra Mahesh Interview
  • శ్రీహరితో సినిమాలు చేసిన చంద్రమహేశ్ 
  • శ్రీహరి మనసున్న మనిషని కితాబు 
  • గుప్తదానాలు చేసేవారని వెల్లడి 
  • అలా సొంతింటి కల నిజమమైందని వివరణ

శ్రీహరి .. నటుడిగానే కాదు, మంచి మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నారు. తెరపై తెలంగాణ యాసకి వైభవాన్ని తీసుకొచ్చిన నటుడు ఆయన. అలాంటి శ్రీహరి ఆ మధ్య అనారోగ్య కారణాల వలన మరణించారు. అలాంటి శ్రీహరితో తనకి గల అనుబంధాన్ని, తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు చంద్రమహేశ్ ప్రస్తావించారు. "శ్రీహరితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో వరుస సినిమాలు చేశాను. వాటిలో 'అయోధ్య రామయ్య' పెద్ద హిట్ అని చెప్పారు.

"శ్రీహరి మంచి మనసున్న మనిషి. ఆయనకి స్నేహితులు ఎక్కువ. ఎవరు ఎలాంటి సాయం అడిగినా లేదనకుండా చేసేవారు. ఆయన చేసిన దానాలు చాలా ఎక్కువని అంటారు. అయితే ఎవరికీ తెలియని దానాలు అంతకంటే ఎక్కువ ఉంటాయని నా అభిప్రాయం. తాను దానం చేశానంటే తనకి పేరు వచ్చినా, ఆ సాయాన్ని పొందిన వ్యక్తి చిన్నబుచ్చుకుంటాడని ఆయన బయటికి చెప్పేవారు కాదు. ఎవరి దగ్గర టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేయడానికి వెనుకాడేవారు కాదు" అని అన్నారు. 

"ఒకసారి ఒక పెద్ద బంగ్లాలో షూటింగు జరుగుతుంటే, అక్కడ శ్రీహరిని కలవడానికి వెళ్లాను. షూటింగు జరుగుతున్న ఆ బంగ్లా ఆయనకి చాలా నచ్చింది. ఆ బంగ్లా చాలా బాగుందనీ .. అలాంటి బంగ్లా జీవితంలో కొనగలమా? .. కట్టగలమా? అని శ్రీహరి నాతో అన్నారు. 'కాలం కలిసొస్తే ఆ బంగ్లా మీరే కొంటారేమో' అన్నాను నేను. ఆ తరువాత కొంతకాలానికి నేను శ్రీహరితో 'అయోధ్య రామయ్య' సినిమా తీయడం, ఆ సినిమాకి ఒక నిర్మాతగా ఉన్న శ్రీహరికి లాభాలు రావడం .. ఆ డబ్బుతో ఆయన అదే బంగ్లా కొనడం జరిగిపోయింది. నా నోటి మాట నిజమైందని చెప్పి, సంతోషపడుతూ ఉండేవారు" అని చెప్పారు. 



Srihari
Srihari actor
Telugu actor Srihari
Ayodhya Ramayya movie
Chandra Mahesh director
Srihari house
Telugu cinema
Tollywood
Srihari philanthropy
Telugu film industry

More Telugu News