Mahesh Babu: మహేశ్ బాబు 'గ్లోబ్ ట్రాటర్' చిత్రం ఈవెంట్‌పై రాజమౌళి బిగ్ అప్డేట్... పూనకం వచ్చినట్టు పాడిన శ్రుతి హాసన్

Mahesh Babu Globe Trotter Rajamouli Event Big Update
  • మహేశ్ బాబు-రాజమౌళి చిత్రానికి గ్లోబ్ ట్రాటర్ పేరు ఖరారు
  • నవంబరు 15న హైదరాబాదులో భారీ ఈవెంట్
  • ఆసక్తికర అప్ డేట్ తో వచ్చిన రాజమౌళి
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29 సినిమాకు 'గ్లోబ్ ట్రాటర్' అనే టైటిల్‌ ఖరారైంది. దీనికి సంబంధించి ఒక భారీ ఈవెంట్‌పై రాజమౌళి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 

"మీ అందరి కోసం ఒక చిన్న విషయాన్ని వదులుతున్నా. నవంబర్ 15న 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌లో కలుద్దాం" అంటూ రాజమౌళి తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ చిత్రంలో శ్రుతి హాసన్ పాడిన ఓ పాటను కూడా పంచుకున్నారు. హై పిచ్ లో పూనకం వచ్చినట్టు ఊగిపోతూ శ్రుతి తన గానంతో ఉర్రూతలూగించడం ఈ వీడియోల చూడొచ్చు. ఈవెంట్‌లో సినిమాకు సంబంధించి 'మునుపెన్నడూ చూడని' రీతిలో ఒక విషయాన్ని రివీల్ చేయబోతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. దీంతో ఈ కార్యక్రమంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ఈవెంట్‌లో సినిమా ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని పాన్-వరల్డ్ స్థాయిలో శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. మహేశ్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా టైటిల్ సాంగ్‌కు సంబంధించిన వివరాలను కూడా పంచుకున్నారు. 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో రానున్న ఈ పాటను కీరవాణి స్వరపరచగా, ప్రముఖ నటి, గాయని శ్రుతి హాసన్, కాలభైరవ ఆలపించారు. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా, టీ-సిరీస్ మ్యూజిక్ లేబుల్‌పై ఈ పాట విడుదల కానుంది. నవంబర్ 15న జరిగే ఈవెంట్‌లో ఈ పాటకు సంబంధించిన అప్డేట్ కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Mahesh Babu
SSMB29
Rajamouli
Globe Trotter
Shruti Haasan
Priyanka Chopra
Prithviraj Sukumaran
MM Keeravani
Telugu movie
Ramoji Film City

More Telugu News