Mohan Bhagwat: పాకిస్థాన్ ను ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!

Mohan Bhagwat Sensational Comments Targeting Pakistan
  • దాయాది దేశానికి అర్థమయ్యే భాషలోనే జవాబివ్వాలన్న మోహన్ భగవత్
  • మనం శాంతి కోరుకుంటుంటే పాక్ మాత్రం అశాంతిని రగులుస్తోందని ఆరోపణ
  • ప్రతిసారీ ఓడించడం ద్వారానే పాక్ కు బుద్ధి చెప్పాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్
భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని, పొరుగు దేశాలతో సఖ్యతతో మెలగాలని కోరుకుంటుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. అయితే, పొరుగు దేశమైన పాకిస్థాన్ మాత్రం మనతో శాంతియుతంగా ఉండాలని అనుకోవడం లేదని ఆయన ఆరోపించారు. భారత దేశానికి హాని కలిగించడం ద్వారానే పాక్ సంతృప్తి చెందుతుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో మనం ఎల్లప్పుడూ శాంతి కోరుకోవడం మంచిది కాదని, పాక్ కు అర్థమయ్యే భాషలోనే జవాబివ్వడం మంచిదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ కు నష్టం కలిగేలా ప్రతిసారీ ఓడిస్తూనే ఉండాలని చెప్పారు.

అప్పుడు పాక్ శాశ్వతంగా పశ్చాత్తాపం చెందక తప్పదని అన్నారు. శాంతిని కోరుకోని వారికి అశాంతిని రుచి చూపించడం ద్వారానే బుద్ధి చెప్పాలని అన్నారు. 1971లో భారత సైన్యం ధాటికి పాకిస్థాన్ 90వేల మంది సైనికులను కోల్పోయిందని, అయినా సరే ఆ దేశ పాలకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. భారత్ ను తాము చేయగలిగింది ఏమీలేదని పాక్ కు అర్థమయ్యే వరకూ ప్రతి దాడి చేయాలన్నారు. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పాక్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిజాయతీగల స్నేహితుడిగా భారత్ కు సహకరిస్తేనే మీకు మేలు కలుగుతుందని పాకిస్థాన్ కు భగవత్ హితవు పలికారు.
Mohan Bhagwat
RSS Chief
Pakistan
India Pakistan Relations
India
Terrorism
Surgical Strike
Cross Border Terrorism
Mohan Bhagwat Comments
RSS

More Telugu News