Anandi: పెళ్లి విషయంలో అలా ఎప్పుడూ ఆలోచించలేదు: హీరోయిన్ ఆనంది!

Anandhi Interview
  • వరంగల్ అమ్మాయిగా ఆనంది 
  • తన అసలు పేరు రక్షిత అని వెల్లడి
  • 'ఈ రోజుల్లో' సినిమాతో ఎంట్రీ  
  • తమిళంలో ఎక్కువ ఛాన్సులు వచ్చాయని వివరణ 

అందమైన అమ్మాయిని చూడగానే ఎవరైనా సరే కనుముక్కుతీరు బాగుంది అని చెప్పుకుంటారు. ఇక పలువరుస .. నవ్వు .. ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకునేవారుంటారు. ఎలాంటి అలంకరణ లేకపోయినా ఎంతో అందంగా ఉంది .. అసలైన అందమంటే ఇదేకదా అనుకుంటారు. అలాంటి లక్షణాలు కలిగిన కథానాయికగా 'ఆనంది' కనిపిస్తుంది. వరంగల్ కి చెందిన ఆనంది, తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి మాట్లాడారు. 

"నా అసలు పేరు రక్షిత. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. తమిళ సినిమా చేస్తున్న సమయంలో దర్శకుడు ప్రభు సాల్మన్ గారు నా పేరును 'ఆనంది'గా మార్చారు. టీవీకి సంబంధించిన ఒక గేమ్ షో కోసం నన్ను ఓంకార్ గారు పరిచయం చేశారు. ఆ షోలో నన్ను చూసిన దర్శకుడు మారుతి గారు 'ఈ రోజుల్లో' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అలా నా సినిమా ప్రయాణం మొదలైంది. అయితే ఆ తరువాత తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఇంతకాలం పాటు సినిమాలు చేస్తానని నేను అనుకోలేదు" అని అన్నారు. 

"ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చాను. స్టార్ స్టేటస్ వచ్చింది గనుక, ఆ కేటగిరికి చెందినవారినే పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక సినిమా షూటింగు సమయంలో .. సెట్లోనే నేను సొక్రటీస్ ను చూశాను. అప్పుడే మా పరిచయం జరిగింది. అతడి అభిప్రాయాలు .. అభిరుచులు నాకు నచ్చాయి. అలా 23 ఏళ్లకే .. పెద్దల అంగీకారంతోనే మా పెళ్లి జరిగింది. ఇప్పుడు మాకు ఒక బాబు .. వాడి పేరు ప్లేటో" అని చెప్పారు.

Anandi
Heroine Anandi
Actress Anandi
Rakshita
Tamil cinema
Telugu cinema
Marriage
Director Maruthi
Socrates
Plato

More Telugu News