Kiran Abbavaram: ‘ఆహా’ లో కె–ర్యాంప్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!
- ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
- థియేటర్లలో విడుదలై మాస్ ఆడియన్స్ ను మెప్పించిన కె–ర్యాంప్
- సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పాటలు
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కె–ర్యాంప్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులోని కొన్ని సన్నివేశాలు, సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. థియేటర్లలో ప్రేక్షకులు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేయడం, అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మాస్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.
జైన్స్ నాని దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా, నరేష్ వీకే, సాయికుమార్, కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’ లో ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని కె–ర్యాంప్ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.