train stabbing: రైలులో బ్లాంకెట్ కోసం గొడవ.. సోల్జర్ ను కత్తితో పొడిచిన రైల్వే కోచ్ అటెండెంట్

Train Tragedy Soldier Jigar Choudhary Dies After Fight Over Blanket
  • నెత్తురోడుతూ స్పాట్ లోనే చనిపోయిన సోల్జర్
  • సెలవుపై ఇంటికి వెళుతుండగా దారుణం
  • జమ్ముతావి– సబర్మతి ఎక్స్ ప్రెస్ లో ఘోరం
సరిహద్దుల్లో సేవలందిస్తున్న ఓ సైనికుడు సెలవుపై ఇంటికి బయలుదేరాడు. ఏసీ కోచ్ లో ప్రయాణం సందర్భంగా బ్లాంకెట్ అడిగితే కోచ్ అటెండెంట్ గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహంతో కోచ్ అటెండెంట్ కత్తితో దాడి చేయగా సైనికుడు రక్తపు మడుగులో పడిపోయాడు. కత్తిపోట్లకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ స్టేషన్ సమీపంలో రన్నింగ్ ట్రైన్ లో చోటుచేసుకుందీ దారుణం. వివరాల్లోకి వెళితే..

ఆర్మీలో సేవలందిస్తున్న జవాన్ జిగర్ చౌధరి ఇటీవల సెలవుపై ఇంటికి బయలుదేరాడు. ఈ నెల 2న జమ్ముతావి– సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలులో సెకండ్ ఏసీ కోచ్ లో ప్రయాణిస్తున్నాడు. ప్రయాణం మధ్యలో కోచ్ అటెండెంట్ జుబైర్ మెమన్ ను ఓ బ్లాంకెట్, బెడ్ షీట్ కోసం రిక్వెస్ట్ చేశాడు. బెడ్ షీట్ ఇచ్చిన మెమన్.. బ్లాంకెట్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మెమన్ తన వద్ద ఉన్న కత్తితో జిగర్ చౌధరిపై దాడి చేశాడు.

తీవ్ర రక్తస్రావంతో జిగర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై టీటీఈ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోచ్ అటెండెంట్ జుబైర్ మెమన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా, ఈ దారుణంపై ఫిర్యాదు అందుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్.. రైల్వే బోర్డు చైర్మన్ కు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది.
train stabbing
Jigar Choudhary
Indian Army
railway coach attendant
Firozpur
Sabarmati Express
railway police
National Human Rights Commission
crime
Punjab

More Telugu News