RTC Bus: హైదరాబాద్ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపుకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
- వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిలోని ఔశాపూర్ వద్ద ఘటన
- కారును ఓవర్ టేక్ చేయడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు
- ఈ ఘటనలో సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సులు ప్రమాదాలకు గురవుతుండటం ప్రయాణికులలో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒక బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపుకు దూసుకెళ్లింది. కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔశాపూర్ వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు 38 మంది ప్రయాణికులతో జనగామ నుంచి ఉప్పల్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఔశాపూర్ వద్ద ముందున్న కారును డ్రైవర్ ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు రోడ్డులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.