Viral Video: బంగారం షాపులో దోపిడీకి ప్లాన్.. కళ్లలో కారం కొట్టబోయి దొరికిపోయిన మహిళ.. యజమాని చేతిలో దేహశుద్ధి

Ahmedabad Gold Shop Owner Thwarts Robbery Attack
  • అహ్మదాబాద్ నగల దుకాణంలో చోరీకి యత్నించిన మహిళ
  • ఒంటరిగా ఉన్న యజమాని కళ్లలో కారం కొట్టేందుకు ప్రయత్నం
  • అప్రమత్తమైన యజమాని ఆమెను పట్టుకుని చితకబాదిన వైనం
  • దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక నగల దుకాణంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుకాణంలో చోరీ చేసేందుకు వచ్చిన ఓ మహిళ, యజమాని కళ్లలో కారం చల్లేందుకు ప్రయత్నించింది. అయితే, అతను అప్రమత్తమై ఆమెను పట్టుకుని చితకబాదాడు. ఈ దృశ్యాలన్నీ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

వివరాల్లోకి వెళితే... అహ్మదాబాద్‌లోని రాణిప్‌ ప్రాంతంలో సోని అనే వ్యక్తికి చెందిన బంగారం దుకాణం ఉంది. అతను షాపులో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ మహిళ లోపలికి వచ్చింది. దుకాణంలో యజమాని తప్ప మరెవరూ లేకపోవడాన్ని గమనించిన ఆమె, చోరీకి ఇదే సరైన సమయమని భావించింది. వెంటనే తనతో తెచ్చుకున్న కారాన్ని తీసి సోని కళ్లలో కొట్టేందుకు ప్రయత్నించింది.

ఆమె చర్యను క్షణాల్లో పసిగట్టిన సోని, వెంటనే ముఖం పక్కకు తిప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం తేరుకుని ఆ మహిళను పట్టుకుని గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత ఆమెను దుకాణం నుంచి బయటకు లాక్కెళ్లాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ వీడియో ఆధారంగా రాణిప్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
Viral Video
Ahmedabad Gold Shop
Gujarat Crime
Robbery Attempt
Rani Police
Gold Shop Attack
CCTV Footage
Woman Thief
India Crime News

More Telugu News