ఈ యాక్షన్ థ్రిల్లర్ ను మిస్సయితే ఫీలవడం ఖాయం!
- జోజు జార్జ్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్
- ఈ ఏడాది జనవరి నుంచి 'సోనీ లివ్'కి
- తెలుగులోను అందుబాటులో
- యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చే కంటెంట్
జోజు జార్జ్ ఈ సినిమాలో 'గిరి' అనే గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడు. ఆయన క్రింద పనిచేసే అనుచరులు .. ఆయన మాట వినే పోలీస్ అధికారులు .. ఆయన అంటే భయపడే శత్రువులు చాలామంది ఉంటారు. ఆయన మాట పైనే సెటిల్ మెంట్లు జరిగిపోతూ ఉంటాయి. అలాంటి 'గిరి' భార్యపై డాన్ - సిజూ అనే ఇద్దరు మెకానిక్ కుర్రాళ్లు అత్యాచారం జరుపుతారు. దాంతో ఆ ఇద్దరిపై పగ తీర్చుకోవడం కోసం అతనే రంగంలోకి దిగుతాడు. ఆయన వేట ఎలా కొనసాగుతుంది? అనేదే కథ.
సాధారణంగా ఒక వ్యక్తి బలం గురించి తెలియనప్పుడే ఆ వ్యక్తి ఫ్యామిలీతో పెట్టుకోవడం జరుగుతుంటుంది. తెలిసిన తరువాత భయపడటం .. బెదిరిపోవడం .. పారిపోవడం చేస్తారు. కానీ తాము గొడవపడింది ఒక గ్యాంగ్ స్టర్ తో అని తెలిసి కూడా ఆ కుర్రాళ్లు ఇద్దరూ తమ పోరాటాన్ని కొనసాగించడమే ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే అంశం. అక్కడక్కడా హింస .. అశ్లీల సన్నివేశాలు ఉన్నాయి. అందువలన ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం బెటర్. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.