KTR: రేవంత్ రెడ్డికి మేమెందుకు భయపడతాం!: కేటీఆర్

KTR Why should we fear Revanth Reddy
  • ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే భయపడేది లేదన్న కేటీఆర్
  • రేవంత్ రెడ్డి 3 ఫీట్లు ఉన్నాడని, కానీ 30 ఫీట్లు ఉన్నట్లుగా డైలాగులు కొడతాడని చురక
  • కాంగ్రెస్ రాష్ట్రాల ఎన్నికలు తెలంగాణ నుంచి డబ్బులు వెళుతున్నాయని వ్యాఖ్య
తాను ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి ఎందుకు భయపడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఉన్నది 3 ఫీట్లే అని, కానీ 30 ఫీట్లు ఉన్నట్లుగా డైలాగులు కొడతాడని విమర్శించారు. ఆయన ఏదో పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తనను తాను అంతకంటే ఎక్కువగా ఊహించుకోవద్దని సూచించారు. తమపై పెట్టే ఉత్తి కేసులు నిలబడవని అన్నారు.

ఎన్నికలకు ఇక్కడి నుంచే డబ్బులు వెళుతున్నాయి

కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో పోటీ చేసే అన్ని ఎన్నికలకు డబ్బులు తెలంగాణ రాష్ట్రం నుంచే వెళుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అంగీకరించారని తెలిపారు. ఈ మేరకు ఆయన సాక్షి టీవీ ఛానల్ ముఖాముఖిలో మాట్లాడుతూ, ఇంత జరుగుతుంటే అమిత్ షా ఏం చేస్తున్నారని నిలదీశారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బులు లేవని చెబుతున్నారని విమర్శించారు. రైతు బంధు, పెన్షన్ పెంపుకు, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, కానీ ఢిల్లీకి మాత్రం వేల కోట్ల రూపాయలు పంపిస్తున్నారని ఆరోపించారు.

మహారాష్ట్ర, హర్యానాతో పాటు ఇప్పుడు జరుగుతున్న బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ విధంగా పోరాడుతుందో అందరికీ తెలుసని అన్నారు. డబ్బులు ఇక్కడి నుంచే వెళుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి వేలాది కోట్ల రూపాయలను రాహుల్ గాంధీకి ముడుపుల రూపంలో రేవంత్ రెడ్డి పంపిస్తున్నారని, దానికి బీజేపీ సహకారం కూడా ఉందని ఆరోపించారు.
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
Telangana
BRS
Congress Party
Amit Shah
Telangana Funds

More Telugu News