Nara Lokesh: నాకు మహిళలంటే గౌరవం... అందుకే మ్యాచ్ కు వెళ్లాను: జగన్ కు మంత్రి లోకేశ్ కౌంటర్

Nara Lokesh Counters Jagans Criticism on Mumbai Trip
  • అప్పుడప్పుడు ఏపీకి వచ్చే జగన్ తమను విమర్శిస్తున్నారన్న లోకేశ్
  • తుపాను సమయంలో సీఎం నుంచి గ్రామ కార్యదర్శి వరకు ప్రజలతోనే ఉన్నామని స్పష్టీకరణ 
  • దేశభక్తి, మహిళల పట్ల గౌరవంతోనే మ్యాచ్‌కు హాజరయ్యానని ఉద్ఘాటన 
  • సొంత తల్లిని, చెల్లిని తరిమేసిన జగన్‌కు మహిళా శక్తి గురించి ఏం తెలుసని విమర్శ
వైసీపీ అధినేత జగన్ ఇవాళ కృష్ణా జిల్లాలో మొంథా తుపాను ప్రభావితా ప్రాంతాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై విమర్శలు గుప్పించారు. తుపాను కారణంగా రైతులు అల్లాడుతుంటే, చంద్రబాబు లండన్ వెళ్లాడని, లోకేశ్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్లాడని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే జగన్ తమను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. 

"అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే జగన్ గారు.. ఎప్పుడూ జనం మధ్య ఉండే మా వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారు. కానీ, మీ వైపు నాలుగు వేళ్లు చూపుతున్నాయని మర్చిపోతున్నారు. తుపాను హెచ్చరిక వచ్చినప్పటి నుంచీ సాధారణ పరిస్థితి నెలకొనే దాకా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు.. చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అంతా ప్రజల చెంతే ఉన్నాం... ప్రజల్ని ఆదుకున్నాం. తుపాను వచ్చినప్పుడు మేమేం చేశామో అవన్నీ మీకు తెలియడానికి మీరు ఇక్కడ లేరు. మీది వేరే భ్రమాలోకం. అందులో విహరిస్తుంటే, ఇవన్నీ తెలియవు. నాకు మహిళలంటే గౌరవం, దేశమంటే భక్తి. అందుకే మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లాను. కోట్లాది భారతీయులు తలెత్తుకునేలా మహిళా మణులు వరల్డ్ కప్ గెలిస్తే, నేనే గెలిచినంత ఆనందించాను. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే!" అంటూ లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. 
Nara Lokesh
Jagan Mohan Reddy
Andhra Pradesh
Cyclone Montha
TDP
YSRCP
Women's World Cup
Mumbai
Chandrababu Naidu
Politics

More Telugu News