Gaddam Prasad Kumar: నవంబర్ 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను విచారించనున్న స్పీకర్

MLA Disqualification Petitions Hearing by Speaker Gaddam Prasad Kumar
  • నవంబర్ 6, 7, 12 మరియు 13 తేదీల్లో విచారణ
  • ఇరువైపుల వాదనలు విననున్న స్పీకర్
  • ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ
బీఆర్ఎస్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి రెండో దశ విచారణను నిర్వహించనున్నారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కింద నవంబర్ 6, 7, 12 మరియు 13 తేదీల్లో విచారణ చేపట్టనున్నారు.

బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్ (జగిత్యాల), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి)లను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్లపై విచారణ జరగనుంది.

స్పీకర్ ఇరువైపుల వాదనలు వింటారు. తొలుత పిటిషనర్లు, ఆ తర్వాత ప్రతివాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రోజుకు ఇద్దరు చొప్పున విచారణ జరగనుంది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కెమెరాల సమక్షంలో విచారణ కొనసాగుతుంది.

మొదటి దఫా విచారణ సెప్టెంబర్ 29, అక్టోబర్ 1, అక్టోబర్ 24 తేదీల్లో జరిగింది. ప్రకాశ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను విచారించారు. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో అనర్హత పిటిషన్లను విచారించడం ఇదే మొదటిసారి.
Gaddam Prasad Kumar
Telangana Assembly
MLA Disqualification
BRS MLAs
Congress Party
Telangana Politics

More Telugu News