Karnataka RTC Bus: మరో బస్సు ప్రమాదం.. వికారాబాద్‌లో సిమెంట్ లారీని ఢీకొట్టిన కర్ణాటక బస్సు

Karnataka RTC Bus Collides with Cement Lorry in Vikarabad
  • కలబురిగి నుంచి తాండూరు వైపు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు
  • ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టిన బస్సు
  • ఒక ప్రయాణికుడి తలకు గాయం
  • డ్రైవర్, కండక్టర్‌లకు స్వల్ప గాయాలు
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాలు ఘటనలు మరవకముందే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం సంభవించింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.

కర్ణాటకలోని కలబురిగి నుంచి తాండూరు వైపు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడికి తలకు గాయమైంది. బస్సు డ్రైవర్, కండక్టర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
Karnataka RTC Bus
Vikarabad bus accident
Tandur accident
Telangana bus accident
Road accident India

More Telugu News