బావిలో పడ్డ ఏనుగులు.. బయటకు తీసేందుకు అధికారుల యత్నం.. వీడియో ఇదిగో!

Elephants Fall into Well in Chhattisgarh Rescue Efforts Underway
––
అటవీ ప్రాంతంలోని ఓ బావిలో నాలుగు ఏనుగులు పడిపోయాయి.. స్థానికులు గమనించి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వాటిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లోని హార్దీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బావిలోని నీళ్లలో ఏనుగులు సాయం కోసం ఎదురుచూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని బర్నవాపారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం సమీపంలోని హార్దీ గ్రామంలో ఉన్న ఓ ఓపెన్ బావిలో ప్రమాదవశాత్తూ ఏనుగులు పడిపోయాయి. బావిలోని ఏనుగులను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది.. ఏనుగులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. అటవీ ప్రాంతాల్లో ఓపెన్ బావులను పూడ్చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Go Back to Shorts
Elephants
Chhattisgarh
Elephant rescue
Hardee village
Barnawapara Wildlife Sanctuary
Open well
Forest department
Elephant video
Wildlife

More Telugu News