John Paul: డ్రగ్స్ దందాలో డాక్టర్.. ఇంట్లోనే దుకాణం పెట్టిన హైదరాబాద్ వైద్యుడు

Hyderabad Doctor Arrested in Drugs Case Selling from Home
  • సోదాల్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
  • ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్న ముఠా
  • డాక్టర్ నివాసం అడ్డాగా మార్చుకుని అమ్మకాలు
హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో ఓ డాక్టర్ డ్రగ్స్ దందా బయటపడింది. ఆయన నివాసంలో లక్షల విలువ చేసే డ్రగ్స్ దొరికాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ డాక్టర్ నివాసాన్ని ఓ ముఠా ఉపయోగించుకుంటోందని, డ్రగ్స్ దాచేందుకు, అమ్మకాలకు ఆయన నివాసాన్ని కేంద్రంగా వాడుకుంటోందని చెప్పారు. వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ లోని ఓ ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జాన్ పాల్ అనే వైద్యుడు అందులో అద్దెకు ఉంటున్నాడని గుర్తించారు.

సోదాల్లో రూ.3 లక్షల విలువ చేసే ఓజీకుష్‌, ఎండీఎంఏ, కొకైన్‌, హాష్‌ఆయిల్‌ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో జాన్‌పాల్‌ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ప్రమోద్‌, సందీప్‌, శరత్‌ ఓ ముఠాగా ఏర్పడి డ్రగ్స్ దందా చేస్తున్నారని బయటపడిందని తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తెప్పించి గుట్టుగా అమ్ముతున్నారని, ఇందుకు జాన్‌ పాల్‌ సహకరిస్తున్నాడని పేర్కొన్నారు. డ్రగ్స్ ను అమ్మినందుకు జాన్ పాల్ కు కొంత ఉచితంగా ఇస్తున్నారని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
John Paul
Hyderabad drugs case
Musheerabad
OG Kush
MDMA
Cocaine
Hash oil
Drugs racket
Telangana
Delhi

More Telugu News