Andhra Pradesh Weather: ఏపీకి మళ్లీ వర్ష సూచన.. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు!

Andhra Pradesh Weather Rain Alert Issued for Several Districts
  • ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండవద్దని హెచ్చరిక
  • ఇటీవలి మొంథా తుపాను ప్రభావం నుంచి కోలుకోకముందే కొత్త అలర్ట్
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
ఇటీవలి ‘మొంథా’ తుపాను ప్రభావం నుంచి ఇంకా తేరుకోకముందే వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. 

మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని, ఆ సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని స్పష్టంగా హెచ్చరించింది.
Andhra Pradesh Weather
AP Rain Alert
Montha Cyclone
AP Weather Forecast
Coastal Andhra
Rayalaseema
AP Disaster Management
Thunderstorms Andhra Pradesh
Heavy Rainfall AP
IMD Forecast

More Telugu News