Deepti Sharma: వరల్డ్ కప్ ఫైనల్లో అదరగొట్టిన దీప్తి శర్మ... పొంగిపోతున్న యూపీ పోలీసులు
- తొలిసారి మహిళల ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు
- ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం
- మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్ దీప్తి శర్మ
- ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా ఉన్న దీప్తి
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ప్రపంచకప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ చిరస్మరణీయ గెలుపులో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కీలక పాత్ర పోషించింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా కూడా సేవలందిస్తున్న దీప్తి, బ్యాట్ మరియు బంతితో అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు కప్ అందించింది.
దీప్తి శర్మ ప్రదర్శనపై ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టిన 'కుశల్ ఖిలాడీ యోజన' కింద డీఎస్పీగా నియమితురాలైన దీప్తిని అభినందించింది. "యూపీ పోలీస్ గర్వపడేలా ప్రపంచ వేదికపై దీప్తి అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నమెంట్‌లో 215 పరుగులు, 22 వికెట్లతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవడమే కాకుండా, దేశానికి, ఉత్తరప్రదేశ్‌కు, యూపీ పోలీస్ శాఖకు అంతర్జాతీయ స్థాయిలో గర్వకారణంగా నిలిచారు. దీప్తి శర్మకు హృదయపూర్వక అభినందనలు" అని డీజీపీ పేర్కొన్నారు.
కాగా, ఈ టోర్నీలో మొత్తం 215 పరుగులు చేసి, 22 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకుంది. మహిళల ప్రపంచకప్ చరిత్రలోనే ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. అంతేకాకుండా, ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో 200కు పైగా పరుగులు, 20కి పైగా వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా (పురుషులు, మహిళల విభాగంలో) సరికొత్త చరిత్ర లిఖించింది. ఫైనల్‌లో లారా వోల్వార్ట్, క్లో ట్రయాన్ వంటి ప్రమాదకర బ్యాటర్లను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది.