Harmanpreet Kaur: క్రికెట్ ఇక 'జెంటిల్మెన్ గేమ్' కాదు!: సామాజిక మాధ్యమాల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఫోటో వైరల్

Harmanpreet Kaur Photo Goes Viral Cricket is Everyones Game
  • హర్మన్‌ప్రీత్ సారథ్యంలో కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు
  • ప్రపంచ కప్ ట్రోఫీని చేతిలో పట్టుకుని నిద్రిస్తున్న ఫొటో వైరల్
  • క్రికెట్ అందరి ఆట అని రాసి ఉన్న టీషర్ట్ దరించిన హర్మన్‌ప్రీత్
క్రికెట్‌ను సాధారణంగా జెంటిల్మెన్ గేమ్‌గా అభివర్ణిస్తుంటారు. అయితే, ఈ అభివర్ణన కాలం చెల్లిందని భారత మహిళా క్రికెట్ జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ పరోక్షంగా చెబుతున్నారు. ఆమె సారథ్యంలోని భారత జట్టు దాదాపు 47 ఏళ్ల భారత అభిమానుల కలను సాకారం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం ఒక ఫొటోను సామాజిక మాధ్యమం వేదికగా పంచుకుంది. ఈ చిత్రం వైరల్‌గా మారింది.

ఈ ఫొటోలో హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రపంచ కప్ ట్రోఫీని చేతిలో పట్టుకుని నిద్రిస్తోంది. ఆమె ధరించిన టీషర్ట్ పైన 'క్రికెట్ అందరి ఆట' అని ముద్రితమై ఉంది. 'క్రికెట్ జెంటిల్మెన్ గేమ్' అని వ్యవహరించడం కారణంగా, జెంటిల్మెన్ అనే పదాన్ని కొట్టివేసి, 'అందరి' అనే పదాన్ని చేర్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

నవీ ముంబై వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్టుపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది.
Harmanpreet Kaur
Indian Women's Cricket
Women's Cricket World Cup
India vs South Africa

More Telugu News