Siddaramaiah: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు గురించి కాంగ్రెస్ మీకు చెప్పిందా?: మీడియాపై సిద్ధరామయ్య అసహనం

Siddaramaiah Reacts Angrily to Media Query on Karnataka CM Change
  • కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ
  • కొంతమంది ఏదో చెబుతుంటారు.. పట్టించుకోవద్దన్న సిద్ధరామయ్య
  • ప్రజల కంటే మీడియా ఎక్కువ ఆసక్తి కనబరుస్తోందని వ్యాఖ్య
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు గురించి పార్టీ అధిష్ఠానం మీకు చెప్పిందా? అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి మార్పు అంశంపై కర్ణాటకలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

ఇలాంటి విషయాలపై కొందరు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతుంటారని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సిద్ధరామయ్య మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ విషయంలో ప్రజల కంటే ఎక్కువగా మీడియా ఆసక్తి చూపుతోందని విమర్శించారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ విషయంపై ఏదైనా చెప్పినప్పుడే దాని గురించి మాట్లాడాలని సూచించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానంతో చర్చిస్తామని అన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పు గురించి సిద్ధరామయ్య, డీ.కె. శివకుమార్‌లు వేర్వేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 11న డీ.కె. శివకుమార్ ఢిల్లీలో పర్యటించనుండగా, 15వ తేదీన సిద్ధరామయ్య కాంగ్రెస్ నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది.
Siddaramaiah
Karnataka CM
Chief Minister Change
Congress Party
DK Shivakumar
Mallikarjun Kharge

More Telugu News