Jogi Ramesh: జోగి రమేశ్ కు వైద్య పరీక్షలు... ప్రభుత్వాసుపత్రి వద్ద అనుచరుల ఆందోళన
- నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
- 12 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు
- విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
- క్యాజువాల్టీ వార్డు అద్దాలను ధ్వంసం చేసిన కార్యకర్తలు
నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రమేశ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆసుపత్రిలోని క్యాజువాల్టీ వార్డు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అంతకుముందు, ఈ రోజు ఉదయం ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో పోలీసులు జోగి రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో కీలక సమాచారం రాబట్టేందుకు జోగి రమేశ్‌ను, ఆయన సోదరుడు రామును వేర్వేరుగా, కలిపి ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే రమేశ్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. "జోగి రమేశ్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని, అందుకు బదులుగా రూ.3 కోట్లు ఆర్థిక సాయం చేసి ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటుకు సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు" అని జనార్దనరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ వాంగ్మూలం కేసులో కీలకంగా మారింది.
ఈ అరెస్టు పూర్తిగా రాజకీయ కుట్ర అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విచారణలో భాగంగా అధికారులు జోగి రమేశ్ మొబైల్ ఫోన్లు, సీసీటీవీ ఫుటేజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షలు పూర్తి కాగానే, ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది.