Kinjerapu Yerran Naidu: ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ.. ఎర్రన్నాయుడికి సీఎం చంద్రబాబు నివాళి
- ఆయన ఉన్నత విలువలకు ప్రతిరూపమన్న సీఎం
- ఉత్తమ పార్లమెంటేరియన్ గా నిలిచారని వ్యాఖ్య
- చివరి శ్వాస వరకూ బడుగుల అభివృద్ధికి పాటుపడ్డారన్న నారా లోకేశ్
దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఎర్రనాయుడు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు దివంగత నేతను గుర్తుచేసుకున్నారు. ఎర్రన్నాయుడు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అని, ఉన్నత విలువలకు ప్రతిరూపమని కొనియాడారు. రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ ఎర్రన్నాయుడు తనదైన ముద్ర వేశారని చంద్రబాబు చెప్పారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా నిలిచారని గుర్తుచేశారు.
మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. ఎర్రన్నాయుడు తన చివరి శ్వాస వరకూ బడుగుల అభివృద్ధి కోసమే పాటుపడ్డారని అన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడపడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఎర్రన్నాయుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.