Telangana State Board of Intermediate Education: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!

Telangana State Board Announces Inter Exam Schedule 2026
వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు థియరీ పరీక్షలు
ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ
ఈసారి ఫస్టియర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ అమలు
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షల సమయం
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం థియరీ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 18న ముగుస్తాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

ఈసారి ఇంటర్ విద్యా విధానంలో బోర్డు ఒక కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు కేవలం సెకండియర్ విద్యార్థులకు మాత్రమే నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలను ఈసారి ఫస్టియర్ విద్యార్థులకు కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 21న ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష, జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ (2026):

ఫిబ్రవరి 25: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ - 1
ఫిబ్రవరి 27: ఇంగ్లీష్ పేపర్ - 1
మార్చి 02: మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
మార్చి 05: మ్యాథ్స్ 1బీ, జువాలజీ, హిస్టరీ - 1
మార్చి 09: ఫిజిక్స్, ఎకనామిక్స్ - 1
మార్చి 12: కెమిస్ట్రీ, కామర్స్
మార్చి 17: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ - 1

ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ (2026):

ఫిబ్రవరి 26: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ - 2
ఫిబ్రవరి 28: ఇంగ్లీష్ పేపర్ - 2
మార్చి 03: మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ - 2
మార్చి 06: మ్యాథ్స్ 2బీ, జువాలజీ, హిస్టరీ - 2
మార్చి 10: ఫిజిక్స్, ఎకనామిక్స్ - 2
మార్చి 13: కెమిస్ట్రీ, కామర్స్ - 2
మార్చి 16: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ - 2
మార్చి 18: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ - 2 
Telangana State Board of Intermediate Education
Telangana Intermediate Exams 2026
TS Inter Exams
Telangana Inter Schedule
Inter Exams Date
TS Inter First Year Exams
TS Inter Second Year Exams
Telangana Education News

More Telugu News