Sushant Singh Rajput: సుశాంత్ ది ఆత్మహత్య కాదు, హత్యే: సోదరి శ్వేత సంచలన ఆరోపణలు

Sushant Did Not Commit Suicide Sister Shweta Shocking Allegations
  • సుశాంత్ సింగ్ మృతిపై మళ్లీ తెరపైకి వచ్చిన చర్చ
  • తన సోదరుడిది హత్యేనని ఆరోపించిన సోదరి శ్వేత సింగ్
  • మెడపై ఉన్నవి ఉరి గుర్తులు కావని సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నాలుగేళ్లు గడిచినా, ఆ కేసు చుట్టూ ఉన్న అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. తాజాగా ఆయన సోదరి శ్వేత సింగ్ కీర్తి చేసిన సంచలన ఆరోపణలు ఈ కేసును మరోసారి వార్తల్లోకి తెచ్చాయి. తన సోదరుడు ఆత్మహత్య చేసుకోలేదని, అతడిని దారుణంగా హత్య చేశారని ఆమె ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు.

"సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు, అతడిని చంపేశారు" అని శ్వేత సింగ్ స్పష్టం చేశారు. తాను సంఘటనా స్థలాన్ని పరిశీలించానని, సుశాంత్ మంచానికి, ఫ్యాన్‌కు మధ్య ఉన్న దూరం చూస్తే అతను ఉరి వేసుకునే అవకాశమే లేదని ఆమె అన్నారు. అంతేకాకుండా, సుశాంత్ మెడపై ఉరితాడు గుర్తు కాకుండా, కేవలం ఒక చిన్న చైన్ ముద్ర మాత్రమే ఉందని, ఇది ఎన్నో అనుమానాలకు తావిస్తోందని వివరించారు.

సుశాంత్ మరణం తర్వాత తాను అమెరికాలో ఒక మానసిక నిపుణుడిని, ముంబైలో మరొకరిని సంప్రదించానని శ్వేత వెల్లడించారు. ఒకరికొకరు సంబంధం లేని ఆ ఇద్దరూ కూడా ఇది హత్యేనని, ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పడం తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. తన తమ్ముడి కెరీర్ వేగంగా ఎదుగుతున్న సమయంలో కొందరు అసూయతో చేతబడి చేయించారని, 2020 మార్చి తర్వాత సుశాంత్ బతకడంటూ తమకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు.

ఇక సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి ప్రవర్తనపై కూడా శ్వేత అనుమానాలు వ్యక్తం చేశారు. "నువ్వు చాలా వేగంగా ఎగురుతున్నావ్, నీ రెక్కలు కత్తిరించాలి" అన్న అర్థం వచ్చేలా రియా ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, దానికి సుశాంత్ లైక్ చేయడం తనకు వింతగా అనిపించిందని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో దర్యాప్తు సంస్థలు ఇది ఆత్మహత్య అని తేల్చినప్పటికీ, శ్వేత సింగ్ చేసిన ఈ తాజా ఆరోపణలతో సుశాంత్ కేసుపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. 
Sushant Singh Rajput
Sushant Singh Rajput death
Shweta Singh Kirti
Rhea Chakraborty
Sushant Singh Rajput murder
Bollywood actor death
Sushant Singh Rajput case
Mumbai police investigation
Sushant Singh Rajput suicide

More Telugu News