Chinna Appanna: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. అప్పన్న రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Chinna Appanna Remand Report Reveals Key Details in Tirumala Laddu Ghee Adulteration Case
  • కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ గుర్తింపు
  • వై.వి. సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్న రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణం
  • కమీషన్ ఇవ్వకపోవడంతో భేలేబాబా డెయిరీని తప్పించిన వైనం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ వ్యవహారం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) కీలక విషయాలను గుర్తించింది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో వై.వి. సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నఅప్పన్నను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. 24వ నిందితుడిగా ఉన్న చిన్న అప్పన్న రిమాండ్ రిపోర్టులో సిట్ కుట్ర కోణాన్ని ప్రస్తావించింది.

దీని ప్రకారం, 2022లో టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను చిన్నఅప్పన్న సంప్రదించారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్ చేశారు. ప్రతి కిలో నెయ్యిపై రూ. 25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేయగా, భోలేబాబా డెయిరీ యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ కంపెనీపై అనర్హత వేటు వేసేందుకు కుట్రకు తెరలేపారు.

డెయిరీని తనిఖీ చేసేలా టీటీడీ అధికారులపై ఒత్తిడి తేవడంతో పాటు, అనర్హత వేటు వేసేలా పిటిషన్లు వేయించారు. ఈ క్రమంలో భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణను టీటీడీ నిలిపివేసింది. ఆ స్థానంలో ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంస్థ ప్రవేశించి, రూ. 138 కోట్లు కోట్ చేసింది. పోటీ లేకుండానే కాంట్రాక్టును దక్కించుకుంది.
Chinna Appanna
Tirumala laddu
TTD
adulterated ghee
SIT investigation
YV Subbareddy

More Telugu News