Ravi Teja: అలా చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు: రవితేజ

Mass Jathara Movie Special
  • రవితేజ హీరోగా రూపొందిన 'మాస్ జాతర'
  • రేపు విడుదలవుతున్న సినిమా
  • దర్శకుడిగా భాను భోగవరపు పరిచయం 
  • హిట్ ఖాయమన్న దర్శకుడు

రవితేజ కథానాయకుడిగా భాను భోగవరపు దర్శకత్వంలో 'మాస్ జాతర' సినిమా రూపొందింది. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమా, రేపు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో భాను భోగవరపు మాట్లాడుతూ, "నేను రవితేజ గారి అభిమానిని. అయన సినిమాలలో నాకు 'వెంకీ' అంటే చాలా ఇష్టం. ఆయనతోనే నా ఫస్టు మూవీ ఉంటుందని నేను అసలు ఊహించలేదు" అని చెప్పారు. 

ఈ సినిమాకి 'మాస్ జాతర' అనే టైటిల్ పెట్టింది రవితేజ గారే. ఇది సాలీడ్ టైటిల్ కావడంతో, అందుకు తగినట్టుగా సీన్స్ ను డిజైన్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని అన్నారు. ఇక హైపర్ ఆది మాట్లాడుతూ .. 'ధమాకా' తరువాత నుంచి రవితేజ గారి సినిమాలలో వరుసగా చేస్తూ వెళుతున్నాను. ఈ సినిమాలు రవితేజగారితో కలిసి నేను చేసే కామెడీ ఆడియన్స్ కి నచ్చుతుంది" అని అన్నారు. 

ఇక రవితేజ మాట్లాడుతూ .. " వేరే ఏ విషయం గురించి మాట్లాడమని చెప్పినా మాట్లాడతాను. కానీ నా గురించి .. నా సినిమాను గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ఇలా వచ్చేస్తున్నాయ్ .. అలా వచ్చేస్తున్నాయ్ .. బాగా వచ్చేస్తున్నాయ్ అన్ని నేను చెప్పలేను. భాను డైరెక్షన్ .. అతని రైటింగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనేది మాత్రం నిజం. ఒకటి మాత్రం చెప్పగలను .. మనకి మరో కమర్షియల్ డైరెక్టర్ వస్తున్నాడు" అని అన్నారు.

Ravi Teja
Mass Jathara
Bhanu Bogavarapu
Sreeleela
Telugu Movie
Hyper Aadi
Venky Movie
Commercial Director
Tollywood
Telugu Cinema

More Telugu News