కూలిపోయిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు
- కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి గృహం
- వరుస వర్షాల కారణంగా శిథిలమై కూలిపోయిన కట్టడం
- 350 ఏళ్ల నాటి చారిత్రక భవనంగా గుర్తింపు
విషయం తెలుసుకున్న పూర్వ మఠాధిపతి కుమారులు వెంకటాద్రిస్వామి, వీరంభట్లయ్య స్వామి, దత్తాత్రేయస్వామి ఘటనా స్థలానికి చేరుకుని, కూలిపోయిన భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ మిద్దె అత్యంత పురాతనమైనదని, చారిత్రక ప్రాధాన్యం ఉన్నదని తెలిపారు. వరుస వర్షాల కారణంగా భవనం బలహీనపడి ఒకవైపుగా కూలిపోయిందని వివరించారు.
ఈ చారిత్రక కట్టడాన్ని పునర్ నిర్మించడానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని వారు వెల్లడించారు. వీలైనంత త్వరగా పునర్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు,, ఈ ఘటన పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.