AP High Court: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP High Court Key Comments on Medical College PPPs
  • వైద్య కళాశాలలను పీపీపీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్
  • మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు
  • ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని వ్యాఖ్య
ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని, టెండర్ ప్రక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది.

రాష్ట్రంలోని వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చడం ద్వారా థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని తేలితే తప్ప, తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ప్రభుత్వం తమ వాదనలు వినిపించిన తర్వాతే అన్ని అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.
AP High Court
Andhra Pradesh High Court
Medical Colleges
PPP
Public Private Partnership
AP Government
Tender Process
Privatization

More Telugu News