Karnataka: బెంగళూరు శివారు గ్రామంలో 'పాకిస్థాన్ జిందాబాద్' వై-ఫై యూజర్ ఐడీ కలకలం

Karnataka Wifi Network Named Pakistan Zindabad Creates Stir
  • యూజర్ ఐడీని చూసి నివ్వెరపోయిన కల్లుబాలు గ్రామస్థులు
  • పోలీసులకు సమాచారం అందించిన బజరంగ్ దళ్ కార్యకర్తలు
  • దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన జిగాని పోలీసులు
కర్ణాటకలో ఒక నెట్‌వర్క్ వై-ఫై పేరు కలకలం రేపింది. రాష్ట్ర రాజధాని బెంగళూరు శివారు గ్రామం కల్లుబాలులో ఒక వై-ఫై పేరు 'పాకిస్థాన్ జిందాబాద్' అని యూజర్ ఐడీతో కనిపించడం ఆందోళనకు దారితీసింది. 'పాకిస్థాన్ జిందాబాద్' అనే యూజర్ ఐడీని చూసి గ్రామస్థులు నివ్వెరపోయారు. సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఉన్నారేమోనని ఆందోళన చెందారు. ఈ విషయం తెలియడంతో స్థానిక బజరంగ్ దళ్ కార్యకర్తలు, గ్రామస్థులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

సమాచారం అందుకున్న జిగానీ స్టేషన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 'పాకిస్థాన్ జిందాబాద్' అనే యూజర్ ఐడీకి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆ వై-ఫై నెట్‌వర్క్ మూలం ఏమిటి? ఆ పేరును ఎవరు సృష్టించారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Karnataka
Pakistan Zindabad
Bangalore
Wifi
Cyber Crime
Bajrang Dal
Jigani Police

More Telugu News