Ayesha Khan: అందాల సుందరి ఆయేషా జాడలేదే!

Ayesha Khan Special
  • తెలుగు తెరపై మెరిసిన సుందరి 
  • యూత్ లో విపరీతమైన క్రేజ్ 
  • కొత్త ప్రాజెక్టులలో కనిపించని వైనం 
  • చేతిలో బాలీవుడ్ సినిమాలు

 ఏ సినిమాకైనా ప్రత్యేకమైన ఆకర్షణ హీరోయిన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే హీరోయిన్ ఆ సినిమాలో అందరి కంటే గ్లామరస్ గా కనిపిస్తుంది. పాటల్లో .. డాన్సులలో రొమాంటిక్ గా కనిపిస్తూ కవ్విస్తుంది. అలాంటి సినిమాలలో హీరోయిన్ కంటే మరొకరు గ్లామరస్ గా కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే హీరోయిన్ గురించి కాకుండా ఆ సినిమాలోని వేరే బ్యూటీని గురించి ఆలోచించే సందర్భాలు కూడా చాలా అరుదుగానే ఉంటాయి. 

అలా ఒక చిన్న పాత్రలో మెరిసిన బ్యూటీని చూసి కుర్రకారు మనసు పారేసుకుంది. ఇంతకాలం ఈ సుందరిని పెట్టుకోకుండా ఇంతమంది ఇన్నేసి సినిమాలు తీసేశారా అనుకుని ఆశ్చర్యపోయారు. ఎవరామె అనుకుంటూ సెర్చ్ చేశారు. అంతగా అందరి హృదయాలను చిలికేసిన ఆ మనోహరి పేరే ఆయేషా ఖాన్. 'ఓం భీమ్ బుష్' సినిమాలో ఆమెను చూసిన కుర్రాళ్లకు కొన్ని రోజుల పాటు కుదురు లేకుండా పోయింది. హాట్ లుక్స్ తో ఆకట్టుకునే ఈ సుందరి ఇంకా ఇక్కడ వరుస సినిమాలు చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. 

అందానికీ .. ఆకర్షణకి ఆయేషా ఖాన్ కేరాఫ్ అడ్రెస్ గానే కనిపిస్తుంది. విశాలమైన కళ్లతో ఆమె చేసే విన్యాసాలకు కుర్రాళ్లంతా పట్టుబడిపోయారు. చక్కని కనుముక్కు తీరు కలిగిన ఆయేషా కాస్త సన్నబడితే హీరోయిన్ గా మెరవడం ఖాయమని అనుకున్నారు. కానీ ఎందుకనో తెలుగులో కొత్త ప్రాజెక్టులలో ఎక్కడా ఆమె పేరు వినిపించడం లేదు. హిందీలో మాత్రం ఒక సినిమా రిలీజ్ కి ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలుగు వైపు నుంచి ఆమెకి ఛాన్సులు వెళ్లడం లేదా? ఆమెనే చేయడం లేదా? అనేది అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. ఇక సమాధానం ఎప్పుడు దొరుకుతుందనేది చూడాలి.

Ayesha Khan
Om Bheem Bush
Ayesha Khan actress
Telugu cinema
Indian actress
Glamorous actress
Ayesha Khan movies
Ayesha Khan latest news
Ayesha Khan updates
Bollywood

More Telugu News