Pakistan: ఆఫ్ఘన్‌లో డ్రోన్ దాడుల వెనుక విదేశీ శక్తి ఉంది... కానీ!: పాకిస్థాన్

Pakistan Admits Foreign Power Behind Afghan Drone Attacks
  • ఆఫ్ఘన్ మీడియాను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనం
  • ఆఫ్ఘన్ పై డ్రోన్ దాడుల వెనుక విదేశీ హస్తం ఉన్నదన్న పాక్
  • ఆ దేశంతో ఉన్న ఒప్పందం కారణంగా దాడులు ఆపలేమన్న పాకిస్థాన్
ఆఫ్ఘన్‌పై డ్రోన్ దాడుల వెనుక విదేశీ శక్తి ఉందని పాకిస్థాన్ అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు ఆఫ్ఘన్ మీడియాను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. సరిహద్దు వెంబడి ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య కొనసాగుతున్న చర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సమయంలో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

ఆఫ్ఘన్‌పై డ్రోన్ దాడుల వెనుక విదేశీ హస్తం ఉన్నప్పటికీ, ఆ దేశంతో ఉన్న ఒప్పందం కారణంగా ఆ దాడులను ఆపలేమని పాకిస్థాన్ నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం. పాక్ నుంచి ఆఫ్ఘన్‌పై డ్రోన్ దాడులు నిర్వహించేందుకు అనుమతించేలా ఆ దేశంతో ఒప్పందం ఉందని, దానికి తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ తెలిపినట్లు ఆ కథనం పేర్కొంది. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం సాధ్యం కాదని, కాబట్టి ఆ దాడులను నిరోధించలేమని అంగీకరించినట్లు పేర్కొంది. అయితే అది ఏ దేశమనేది వెల్లడించలేదని సమాచారం.

ఇటీవల పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే రెండు వారాల క్రితం ఆప్ఘన్ రాజధాని కాబూల్‌లో సంభవించిన పేలుళ్లతో అవి తీవ్రరూపం దాల్చాయి. పాకిస్థానీ తాలిబన్ ఫైటర్లకు ఆశ్రయం కల్పించేవారిపై తీవ్ర చర్యలు ఉంటాయని పాక్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పేలుళ్లు జరిగాయి.
Pakistan
Afghanistan
Drone attacks
Foreign power
Kabul
Pakistan Taliban
Terrorism
Border conflict

More Telugu News