Harish Rao: హరీశ్ రావుకు ఫోన్ చేసి పరామర్శించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్

YS Jagan consoles Harish Rao after his fathers death
  • ఉదయం కన్నుమూసిన హరీశ్ రావు తండ్రి సత్యనారాయణరావు
  • సత్యనారాయణ కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి
  • సత్యనారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన జగన్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సంతాపం తెలియజేశారు. జగన్... హరీశ్ రావుకు ఫోన్ చేసి పరామర్శించారు.

సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు. హరీశ్ రావును జగన్ ఫోన్‌లో పరామర్శించారని వైసీపీ తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా తెలిపింది. సత్యనారాయణ మృతి విషయం తెలియగానే జగన్ ఉదయం తన 'ఎక్స్' ఖాతా వేదికగా విచారం వ్యక్తం చేశారు.

నేడు బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలు రద్దు

తన్నీరు సత్యనారాయణరావు మంగళవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. మరోవైపు, సత్యనారాయణ మృతి నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలను ఆ పార్టీ నేడు రద్దు చేసింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
Harish Rao
YS Jagan
Jagan Mohan Reddy
Tanneeru Satyanarayana
BRS
Telangana
Andhra Pradesh
Condolences
Political News

More Telugu News