Bigg Boss Telugu: బిగ్ బాస్ లో రమ్య మోక్షకు దక్కిన పారితోషికం ఎంతంటే..!

Bigg Boss Telugu Ramya Moksha Controversy and Remuneration
  • వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రమ్య
  • నోటి దురుసుతనం కారణంగా రమ్యపై ప్రేక్షకుల్లో నెగెటివిటీ
  • రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయి బయటకు..
బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయింది. ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటినప్పటికీ తన నోటి దురుసుతనం కారణంగా ప్రేక్షకుల్లో నెగెటివిటీ పెంచుకుంది. ఫలితంగా ఆడియెన్స్ ఓటింగ్ లో వెనకపడి బయటకు వచ్చేసింది. అప్పటికే హౌస్ లో ఉన్న టాప్ కంటెస్టెంట్లు కల్యాణ్, తనూజలను టార్గెట్ చేసిన రమ్య.. వారిని వ్యక్తిగతంగా కించపరిచే ప్రయత్నం చేసింది. దీంతో రమ్యపై బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పచ్చళ్ల వ్యాపారానికి సంబంధించి ఒక వినియోగదారుడిని దూషిస్తూ చేసిన వాట్సాప్ మెసేజ్ కారణంగా సోషల్ మీడియాలో రమ్య విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది. ఈ మెసేజ్ కారణంగానే ఆమె సెలబ్రిటీగా మారింది. అదే ఆమెకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ కల్పించేలా చేసింది. తనపై ఉన్న నెగెటివిటీని బిగ్ బాస్ ద్వారా రమ్య పోగొట్టుకుంటుందని చాలామంది భావించారు. అయితే, అందుకు విరుద్ధంగా మరింత నెగెటివిటీని రమ్య మూటగట్టుకుంది. రెండు వారాల్లోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కాగా, బిగ్ బాస్ లో రెండు వారాలు ఉన్న రమ్యకు భారీ పారితోషికం ముట్టినట్లు సమాచారం. వారానికి రూ.1.5 లక్షల నుంచి 2 లక్షల చొప్పున రెండు వారాలకు రూ.4 లక్షల వరకు బిగ్ బాస్ నుంచి రమ్య అందుకున్నట్లు తెలుస్తోంది.
Bigg Boss Telugu
Ramya Moksha
Alekhya Chitti Pickles
Bigg Boss Remuneration
Telugu Reality Show
Nagarjuna
Elimination
Trolling
Kalyan
Tanuja

More Telugu News