Election Commission of India: దేశవ్యాప్తంగా 'ఎస్ఐఆర్'... నేడు ఈసీ కీలక ప్రకటన

Election Commission to Announce Key SIR Details Today
  • దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ కు సిద్దమైన ఈసీ
  • తొలి దశలో 10 - 15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్
  • వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు తొలిదశలోనే
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ - ఎస్ఐఆర్)పై ఎన్నికల సంఘం ఈరోజు కీలక ప్రకటన చేయనుంది. బీహార్ తరహాలోనే దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధమైన ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం 4.45 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో తొలిదశలో భాగంగా 10-15 రాష్ట్రాల్లో చేపట్టనున్న ఎస్ఐఆర్ పై ఈసీ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాలు తొలిదశ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ కార్యక్రమానికి రాష్ట్రాల సీఈవోలు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఈవోల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ మేరకు సూచనలు చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు ఎస్ఐఆర్ పై ఉన్న అనుమానాలను కమిషనర్ నివృత్తి చేశారు.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో 2002-04 మధ్యకాలంలో ఓటరు జాబితాల సమగ్ర సవరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు 20 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో నకిలీ ఓటర్లను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు ప్రారంభించినట్లు ఈసీ వెల్లడిస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఎస్ఐఆర్ చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 
Election Commission of India
SIR
Special Summary Revision
Voter List
Assembly Elections 2025
Gyanesh Kumar
Supreme Court
Fake Voters
Tamil Nadu Elections
West Bengal Elections

More Telugu News