కడప జిల్లాలో కలకలం.. వృద్ధ జంట హత్య
- రోకలి బండతో తలలు పగలగొట్టిన దుండగులు
- ఇటుకల బట్టీ సమీపంలోని ఇంట్లో దారుణం
- బీరువాలో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేసిన హంతకులు
పిల్లలతో కలిసి ఓబులమ్మ జమ్మలమడుగులో నివాసం ఉంటున్నారు. నాగప్ప, పెద్దక్క తాడిపత్రిలో రహదారిలోని ఇటుకల బట్టీ నడుపుతూ అక్కడే ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇటుకల బట్టీ వద్ద నిర్మించుకున్న గదిలో నిద్రిస్తున్న నాగప్ప, పెద్దక్కలను దుండగులు రోకలి బండతో తలలు పగలగొట్టి హతమార్చారు. పక్క గదిలోని బీరువాలో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యలు దోపిడీదొంగల పనా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.